ఈ ఉద్యోగి కేవలం 18 నెలల్లోనే లక్షాధికారి అయ్యాడు.. ఎలా? డబ్బు సంపాదనకు చిట్కాలు

రచుగా ప్రజలు ధనవంతులు కావడం చాలా కష్టమైన పని అని భావిస్తారు. ముఖ్యంగా మీరు మీ కెరీర్‌ను ప్రారంభించినప్పుడు. కానీ సమయం, కృషి, సరైన నిర్ణయాలతో చాలా త్వరగా ధనవంతులు అయ్యే వ్యక్తులు కొందరు ఉన్నారు.


ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను రూ. 2 కోట్ల విలువైన ఆస్తులను ఎలా సృష్టించాడో చెప్పుకొచ్చాడు. అతను ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. మీరు డబ్బును సరిగ్గా ఉపయోగించుకుని పెట్టుబడి పెడితే, మీరు కూడా త్వరగా ధనవంతులు కావచ్చని అతను చెబుతున్నాడు.

మొదటి కోటి రూపాయలు ఆదా చేయడానికి అతనికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. కానీ అతను తదుపరి కోటి రూపాయలను కేవలం ఒకటిన్నర సంవత్సరాలలో అంటే 18 నెలల్లో ఆదా చేశాడు. ప్రారంభంలో నెమ్మదిగా పెరుగుదల, తరువాత వేగంగా పెరుగుదల ఉంది. అతను 11 సంవత్సరాల క్రితం తన కెరీర్‌ను ప్రారంభించాడు. ప్రారంభ సంవత్సరాల్లో తాను పెద్దగా డబ్బు ఆదా చేయలేదని చెప్పుకొచ్చాడు. అతను 2018 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. ఇది అతని పొదుపు వేగాన్ని మరింత మందగించింది. కానీ సెప్టెంబర్ 2023 నాటికి అతను రూ. 1 కోటి ఆదా చేశాడు. ఆ తర్వాత అతని సంపద కేవలం 18 నెలల్లోనే రెట్టింపు అయింది.

తన పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన అన్నారు. ఆయన స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టారు. మ్యూచువల్ ఫండ్లలో కూడా SIP ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టారు. దీనివల్ల ఆయనకు కాంపౌండింగ్ ప్రయోజనం కలిగింది. కాంపౌండింగ్ అంటే మీ పెట్టుబడిపై మీకు వచ్చే వడ్డీపై వడ్డీ లభిస్తుంది. దీనివల్ల మీ సంపద వేగంగా పెరుగుతుందని చెబుతున్నాడు. ఈ సమయంలో ఆయన జీతం కూడా చాలా పెరిగింది. అందువల్ల ఆయన ఎక్కువ డబ్బు ఆదా చేయగలిగారు. అందుకే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నెలవారీ ఖర్చు, పెట్టుబడి అలవాట్లు:

అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. అతనికి ఇద్దరు కవల కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ అతను తన నెలవారీ ఖర్చులు దాదాపు రూ. 1.2 లక్షలు ఉంది. ఇందులో అద్దె, పాఠశాల ఫీజులు, రేషన్, గృహ సహాయం, విద్యుత్ బిల్లు, పెట్రోల్, బీమా, చందాలు ఉన్నాయి. అతని సంపాదనలో దాదాపు 60% పెట్టుబడి పెట్టడానికి ప్లాన్‌ చేసుకున్నాడు. ఇలా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా త్వరగా డబ్బు సంపాదించాననని చెబుతున్నాడు. అలాగే దేనిలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు అనుభవం కలిగిన నిపుణులను సంప్రదించి చేయాలని, అప్పుడు డబ్బును సంపాదించుకోవచ్చంటున్నాడు.

అతను తన డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు. అందుకే తన సంపద ఇంత వేగంగా పెరిగిందని అతను భావిస్తున్నాడు. మార్కెట్లో డబ్బును ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో ఆలోచించడం కంటే, మీరు ఒక వ్యూహానికి కట్టుబడి నిరంతరం పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని అతను చెబుతున్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.