యాపిల్‌,సామ్‌సంగ్ కాదు అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే…టాప్ 10 లో ఉన్న ఫోన్లు ఇవే

పండగ సీజన్ కావడం భారీ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, EMI ఆప్షన్స్ లాంటి ఆఫర్స్ తో ఫోన్ ల విక్రయాలలో 2025 మూడో త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఐదు సంవత్సరాల రికార్డు స్థాయిని చేరుకుంది.


ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మూడో త్రైమాసికంలో 4.3% YOY వృద్ధితో 48 మిలియన్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి.నివేదిక ప్రకారం వివో అత్యధిక అమ్మకాలు నమోదు చేసి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.సామ్‌సంగ్, రెడ్‌మీ, రియల్‌మీ, మోటోరోలా తదితర బ్రాండ్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లలో సామ్‌సంగ్ ను వెనకకి నెట్టి యాపిల్‌ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
టాప్ 10 లో ఉన్న ఫోన్లు

మిడ్ రేంజ్ ఫోన్స్ ,ప్రీమియం ఫోన్స్ ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటు ధరలో ఉండడంతో ఎంట్రీ లెవెల్ మోడల్స్ కంటే వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపారు. ఏడవ త్రైమాసికంలో వివో వరుసగా 18.3% వాటాతో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఒప్పో 13.9%, శాంసంగ్ 12.6 % రెండు,మూడు స్థానంలో నిలిచాయి.

యాపిల్‌ భారతదేశంలో తన అత్యుత్తమ గుణకాలు నమోదు చేసింది. 5 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను పంపిణీ చేసి మొత్తం మార్కెట్‌లో తొలిసారిగా 10.4% తో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.తరువాత వరుసగా రియల్‌మీ 9.8%, షావోమి 9.2 % స్థానాల్లో ఉన్నాయి.నివేదిక ప్రకారం వన్‌ప్లస్‌ మాత్రం 30.5% తగ్గి మార్కెట్ లో 2.4% నికి పరిమితం అయింది.ముఖ్యమైన బ్రాండ్లలో మోటోరోలా అత్యధికంగా 52.4% YOY వృద్ధిని నమోదు చేసింది

IDC ప్రకారం సూపర్ ప్రీమియం విభాగం 52.9% YoY వృద్ధిని నమోదు చేయగా ప్రీమియం సెగ్మెంట్ 43.3% మేర నమోదుచేశాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్7 వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ లో యాపిల్‌ హై ఎండ్ మార్కెట్‌లో 66% వాటాతో ఆధిపత్యం సాధించింది.యాపిల్‌ ఫోన్ కొత్త మోడల్స్‌తో పాటు పాత మోడల్స్‌కి కూడా డిమాండ్ పెరగడంతో ఐఫోన్‌ విక్రయాలు 25.6% పెరిగాయి.గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S25 అల్ట్రా, గెలాక్సీ Z Fold7 వంటి మోడల్స్‌ డిమాండ్ ఉండడంతో సామ్‌సంగ్ 31% వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
ఆఫ్‌లైన్ అమ్మకాలు కూడా ఆన్‌లైన్ అమ్మకాల కంటే మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. పండుగ ఆఫర్లు ధరల డిస్కౌంట్ వల్ల 21.8% YOY వృద్ధిని సాధించి మొత్తం మార్కెట్‌లో 56.4% వాటాను కలిగి ఉన్నాయి.

BRANDS 3Q24 MARKET SHARE 3Q25 MARKET SHARE YOY UNIT CHANGE
1. VIVO 15.8% 18.3% 20.7%
2. OPPO 13.9% 13.9% 4.2%
3. SAMSUNG 12.3% 12.6% 6.3%
4. APPLE 8.6% 10.4% 25.6%
5. REALME 11.5% 9.8% -10.9%
6. XIAOMI 11.4% 9.2% -15.6%
7. MOTOROLA 5.7% 8.3% 52.4%
8. POCO 5.8% 4.3% -21.9%
9. iQOO 4.2% 3.3% -16.9%
10. ONE PLUS 3.6% 2.4% -30.5%
OTHERS 7.2% 7.5% 8.0%
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.