ఈ ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..28కిమీ మైలేజ్ ఇచ్చే మారుతి కారు పై ఏకంగా రూ.2.40లక్షల తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడంలో మారుతి సుజుకి, టయోటా భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వచ్చిన గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్స్, మార్కెట్‌లో క్రెటా ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో విజయవంతమయ్యాయి.


ఈ రెండు మోడల్స్ అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు పైగా అమ్మకాలు జరిపి, తమ సత్తాను చాటుకున్నాయి.

మొదట్లో గ్రాండ్ విటారా అమ్మకాలు జోరుగా ఉన్నప్పటికీ, ఇటీవల టయోటా హైరైడర్ కొంచెం మెరుగైన అమ్మకాలు సాధిస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, తమ అమ్మకాలను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌లను క్లియర్ చేయడానికి, గ్రాండ్ విటారాపై భారీ ఇయర్-ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది.

ఈ ఆఫర్లలో భాగంగా, గ్రాండ్ విటారా ఎస్‌యూవీని కొనుగోలుదారులు ఏకంగా రూ.2.40 లక్షల వరకు ప్రయోజనాలతో సొంతం చేసుకోవచ్చు. ఇందులో నగదు తగ్గింపులతో పాటు, ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ కవరేజ్ కూడా ఉంటుంది. అయితే మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ముఖ్యంగా హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను బట్టి ఈ తగ్గింపు ఆఫర్‌లో మార్పులు ఉంటాయి.

2022లో విడుదలైన ఈ గ్రాండ్ విటారా, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్‌కు ఉపయోగపడే హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), కారు చుట్టూ చూడటానికి 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

గ్రాండ్ విటారా రెండు ప్రధాన ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ 102 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 19.38 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనికి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.

1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ ఇది 113 బీహెచ్‌పీ పవర్‎తో పాటు, ఏకంగా 27.97 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. ఈ వేరియంట్ eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది.

సాంప్రదాయ ఇంజన్ ఆప్షన్లతో పాటు, గ్రాండ్ విటారా సిఎన్‌జి పవర్‌ట్రైన్ (26.6 కి.మీ/కిలో మైలేజ్), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లతో కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.77 లక్షల నుంచి రూ.20.22 లక్షల వరకు ఉంది.

సిఎన్‌జి వేరియంట్‌ అద్భుతమైన మైలేజీని ఇస్తుందని మారుతి చెబుతోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3 లక్షల కంటే ఎక్కువ మంది గ్రాండ్ విటారాను కొనుగోలు చేశారు. ఇటీవల మారుతి సేఫ్టీ మీద కూడా దృష్టి పెట్టింది. దీంతో కస్టమర్లకు గతంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి.

భారతీయ కస్టమర్‌లకు తక్కువ ధరలో, అత్యధిక మైలేజ్, అత్యాధునిక ఫీచర్లను అందించాలనే మారుతి సుజుకి వ్యూహానికి ఈ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ నిదర్శనం. ఈ ఇయర్-ఎండ్ సేల్‌లో గ్రాండ్ విటారాను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.