మోకాళ్ళ నొప్పులు..( Knee Pains ) వయసు పైబడిన వారే కాదు ఇటీవల కాలంలో 30 ఏళ్ల వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కారణం ఏదైనా సరే మోకాళ్ళ నొప్పుల కారణంగా తీవ్రమైన బాధకు గురవుతుంటారు.
ఎక్కువసేపు ఏ పని చేయలేకపోతుంటారు. నడవడానికి, నిలబడడానికి, మెట్లు ఎక్కడానికి కూడా ఎంతో కష్టతరంగా ఉంటుంది. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా..? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మోకాళ్ళ నొప్పులకు ఈ ఆయిల్ ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఆయిల్ తయారీ కోసం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వుల నూనెను( Sesame Oil ) పోసుకోవాలి. అలాగే 10 నుంచి 15 శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి( Garlic ) రెబ్బలు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఆపై ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఇక ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నైట్ నిద్రించేముందు లేదా స్నానం చేయడానికి రెండు గంటలు ముందు నిత్యం ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు. ఈ ఆయిల్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ మాదిరిగా పనిచేస్తుంది. నిత్యం ఈ ఆయిల్ ను వాడటం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వాపు తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ ఆయిల్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే మోకాలి నొప్పిని నివారించడంలో ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి



































