మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు తాగి చిన్నారులుమరణించిన నేపథ్యంలో డై-ఇథైలిన్ గ్లైకోల్(డీఈజీ)ను పరిమితికి మించి కలిగి ఉన్నట్టు గుర్తించిన మూడు దగ్గు సిర్‌పలపై డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌ను జారీ చేసింది.
కల్తీ దగ్గు సిర్‌పలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారా? అని భారతదేశ అత్యున్నత మందుల నియంత్రణ సంస్థ సీడీఎ్‌ససీవోను వివరణ కోరిన అనంతరం డబ్ల్యూహెచ్‌వో ఈ అలర్ట్‌ను జారీ చేసింది. కాగా, ఈ మందులను ఎగుమతి నిమిత్తం తయారు చేయలేదని, అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవని డబ్ల్యూహెచ్‌వోకు సీడీఎ్‌ససీవో తెలియజేసింది. 2022లో గాంబియా దేశంలో కనీసం 70 మంది చిన్నారులు మరణించినప్పటి నుంచి భారత్‌లో తయారైన సిర్‌పలపై డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన 5వ అలర్ట్ ఇది.



































