ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు, అయితే మనిషి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. ఎవరైనాసరే విజయం సాధించాలంటే, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటాలి.
ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వాటిని సరిగ్గా అనుసరిస్తే విజయానికి మార్గం సులభతరం అవుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలను చాణక్య తెలిపారు. రెండు ముఖ్యమైన విషయాల్లో భయపడే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పోరాడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడి పనిచేయడం
తాను చేయాల్సిన పని విషయంలో ఎప్పుడూ బద్ధకించని వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధించి, దానిలోని ఆనందాన్ని అందుకుంటాడని ఆచార్య చాణక్య తెలిపారు. కృషి చేయకుండా పురోగతి సాధ్యంకాదు. కష్టపడి పనిచేయడానికి భయపడే వ్యక్తి ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అలాంటివారు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సివస్తుంది. కష్టపడితేనే లక్ష్యం నెరవేరుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.
విమర్శలను ఎదుర్కోవడం
విమర్శ అనేది మనిషిని తీవ్రంగా కలవరపెడుతుంది. తప్పు చేయనప్పుడు విమర్శలను తట్టుకునేవాడే ధైర్యవంతుడు. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎవరైనాసరే విమర్శలు ఎదుర్కొనే సమయం ఖచ్చితంగా వస్తుంది. వాటిని చూసి భయపడేవాడు తన గమ్యాన్ని చేరుకోలేడు. విమర్శ అనేది విజయ మార్గంలో అడ్డంకి.
అందుకే దానిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించాలని ఆచార్య చాణక్య సూచించారు. ప్రత్యర్థి చేసే విమర్శలకు భయపడి నిరుత్సాహపడకండి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. ప్రత్యర్థులకు భయపడితే తప్పటడుగులు వేసి విఫలమవుతారని చాణక్య తెలిపారు.