కోడిగుడ్డులోని పచ్చసొన తినకుండా పారేస్తున్నారా..? ఇది ఎంత అవసరమో తెలిస్తే ఇకపై ఆ తప్పు చేయరు.

www.mannamweb.com


శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో చాలా మంది గుడ్డులోని పచ్చ సొనను తినకుండా పక్కన పెడుతుంటారు. తెల్లసొనను మాత్రమే తింటుంటారు. అయితే, గుడ్డు తెల్లసొనలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.

కానీ పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఇది మన కళ్లను హెల్తీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకు ఒక పచ్చ సొన తినడం వల్ల ఎవరూ బరువు పెరిగిపోరు. కాబట్టి రోజుకో పచ్చసొనను తినడం చాలా అవసరం.

అంతేకాదు.. మీకు తెలుసా? పచ్చసొనలో విటమిన్ డి మెండుగా ఉంటుంది. ఇది మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. పచ్చ సొనలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే కోలిన్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డు పచ్చసొనలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

గుడ్డు పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. గుడ్డు పచ్చసొన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే పచ్చసొనను తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)