2019 సంక్రాంతి పోటీలో నిలిచిన బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్ మళ్లీ ఇప్పుడు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఈ నెల 10న, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ఈ నెల 12న, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ఈ నెల 14న విడుదల కానున్నాయి.
మేకర్స్ విజ్ఞప్తి మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మరి, ఏ సినిమాకి టికెట్ ధర ఎంత పెంచారు? ఎప్పటి వరకూ అమల్లో ఉంటాయి? చూద్దాం (Sankranti Movies Ticket Rates)..
గేమ్ ఛేంజర్
తెలంగాణలో: విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోల ప్రదర్శనకు అనుమతి వచ్చింది. అదే రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100+, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150+ అదనపు ధరలు ఉండనున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50+, మల్టీప్టెక్స్‌ల్లో రూ.100+ అదనం.
ఆంధ్రప్రదేశ్‌లో: అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అది కాకుండా జనవరి 10న 6 షోలు ప్రదర్శించనున్నారు. అదనంగా.. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175. ఈ నెల 11 నుంచి 23 వరకు 5 షోలు.. అదే ధరలతో ప్రదర్శితమవుతాయి.
డాకు మహారాజ్
ఏపీలో: విడుదల రోజు (12న) ఉదయం 4 గంటల ప్రత్యేక షో నిర్వహించేందుకు, ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 25 వరకు.. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 135 అదనంగా ఉండనున్నాయి. ధరల పెంపు విషయమై తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న ధరలతో తాము హ్యాపీగా ఉన్నామని నిర్మాత నాగవంశీ చెప్పడం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం
ఏపీలో: 14న 6 షోలు ప్రదర్శించనున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 125 అదనం. ఈ నెల 15 నుంచి 23 వరకు 5 షోలు ఉండనున్నాయి. అవే ధరలు కొనసాగనున్నాయి.