Tiruttani Temple : ఏదైనా వస్తువు మిస్సయితే ఎంతో బాధ కలుగుతుంది. ఆ వస్తువు దొరకాలని పోలీస్ స్టేషన్లలో కంప్లెంయిట్ ఇస్తాం.. అదృష్టవశాత్తూ ఆ వస్తువు దొరికితే దొరుకుతుంది..
లేకుంటే ఆ వస్తువు దొరకాలని దైవానికి పూజలు చేస్తాం. ఆ వస్తువు దొరికితే కొన్ని ప్రత్యేక పూజలు,వ్రతాలు చేస్తామని ముడుపు కడుతూ ఉంటారు. అయితే ఈ స్వామిని దర్శించుకొని పూజించడం వల్ల మిస్సయిన వస్తువు తిరిగి పొందుతారనే నమ్మకం ఉందని కొందరు భక్తులు అంటున్నారు. పురాణాల ప్రకారం కొందరు దేవతలు తమ శక్తిని కోల్పోగా ఈ స్వామిని వేడుకొంటే తిరిగి తమ యథాస్థానానికి వచ్చారని తెలుస్తోంది. ఇంతకీ ఆ వరాన్ని ఇచ్చే స్వామి ఎవరు? ఆ లయం ఎక్కడ ఉంది?
దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి అంటే కొందరికీ మహా ఇష్టం. ఆయన ఇష్ట రోజైన మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమిళనాడులోని ఫలణి క్షేత్ర సుబ్రహ్మణ్య స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. అయితే ఇదే రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైన మురుగన్ స్వామి ప్రత్యే వరాలు ఇచ్చే దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. దేవసేన సమేతంగా కొలువైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఈ ఆలయం ఎంతో పురాతనమైంది.
సుమారు 1600 సంవత్సరాల కిందట పల్లవ, చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఉత్తరాన ఓ పర్వతం ఉంటుంది. ఇది తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని అంటారు. తిరుత్తణి క్షేత్ర స్థల పురాణం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకల రాజులతో యుద్ధం చేశాడని చెబుతారు. ఆ తరువాత ఇక్కడ కొలువయ్యారని చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని శాంతిపురి, తణిగ అని కూడా పిలుస్తారు.
అయితే ఈ స్వామిని దర్శించుకుంటే ఏదైనా వస్తువు పొగొట్టుకుంటే తిరిగి పొందుతారట. ఒక సమయంలో బ్రహ్మ ను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో తాను సృష్టించే శక్తిని కోల్పోతాడట. దీంతో తాను తిరుత్తణిలో ఉన్న మురుగణ్ ను పూజించడం వల్ల తిరిగి తన శక్తిని తెచ్చుకుంటాడట. మరో చరిత్ర ప్రకారం ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంఘనీతి, పద్మనీతి, చింతామణి, ఐశ్వర్యాలను సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తరువాతే తిరిగి పొందాడని చెబుతున్నారు. అందువల్ల ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల పొగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారనే పేరు వచ్చింది.