ఈ వారం ఓటీటీల్లో ఐదు రిలీజ్‍లు ఆసక్తిని రేపుతున్నాయి. ముఫాసా చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఓ హారర్ థ్రిల్లర్ సినిమా కూడా అడుగుపెట్టనుంది.
ఈ మార్చి నెల చివరి వారంలోనూ వివిధ ఓటీటీల్లో కొన్ని నయా సినిమాలు, వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. ఐదు రిలీజ్‍లపై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. హాలీవుడ్ చిత్రం ముఫాసా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. హారర్ థ్రిల్లర్ చిత్రం శబ్దం కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఓ వెబ్ సిరీస్ కూడా క్యూరియాసిటీ మధ్య వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
ముఫాసా: ది లయన్ కింగ్
హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 26వ తేదీన ఈ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. సింహాలు సహా అడవిలోని జంతువులతో సాగే ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రానికి జెర్రీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడన్న అంశంతో లయన్ కింగ్ చిత్రానికి సీక్వెల్‍గా తీసుకొచ్చారు. ముఫాసా సినిమా తెలుగు వెర్షన్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. గతేడాది డిసెంబర్ 20న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ బుధవారం (మార్చి 26) నుంచి జియో హాట్‍స్టార్ ఓటీటీలో ముఫాసా: ది లయన్ కింగ్ చూసేయవచ్చు.
ఓం కాళి జై కాళి
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఓం కాళి జై కాళి’ మార్చి 28వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తమిళ సిరీస్ తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో వెమల్ ప్రధాన పాత్ర పోషించగా.. కరుప్పు, రాము చెల్లప్ప, పుజళ్, పావని రెడ్డి, కుమారమూర్తి కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు రాము చెల్లప్ప దర్శకత్వం వహించారు.
మజాకా
సందీప్ కిషన్ హీరోగా నటించిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం మజాకా ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీలో ఈ సినిమా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది.
మజాకా చిత్రంలో సందీప్ కిషన్‍కు జోడీగా రితూ వర్మ నటించారు. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర, రాజేశ్ దండా, భన్సల్ ప్రొడ్యూజ్ చేశారు. మరి అంచనాలకు తగ్గట్టు మజాకా చిత్రం ఈ వారమే జీ5లోకి వస్తుందేమో చూడాలి.
మిస్టర్ హౌస్‍కీపింగ్
తమిళ కామెడీ డ్రామా మూవీ ‘మిస్టర్ హౌస్‍కీపింగ్’ మార్చి 25వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో హరిభాస్కర్, లోహ్సిలియా మరియనేసన్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 24వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.
శబ్దం
ఆది పినిశెట్టి హీరోగా నచించిన హారర్ థ్రిల్లర్ చిత్రం శబ్దం మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు బయటికి వచ్చాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అళివరగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.