మద్యం సేవించడం 30 రోజులు మానేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ముందుగా నష్టపోయేది, కాలేయమే.
మందు తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. నెల రోజులు మందు మానేస్తే కాలేయం కాస్త కోలుకుంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల మెటబాలిజం రేటు మందగించి కేలరీల ఖర్చు తగ్గిపోతుంది. దీంతో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. అయితే నెల రోజులు ఆల్కహాల్ మానేసి చూడండి. పొట్ట తగ్గడం మీరే గమనిస్తారు
మద్యం తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందన్నది మీ అపోహ మాత్రమే. డీహైడ్రేషన్, మూత్రం రావడం, దాహం వేయడం వంటి కారణాలతో అర్ధరాత్రి మెలకువ వస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. అదే మద్యం మానేస్తే మెదడు ఉల్లాసంగా ఉంటుంది. మంచి నిద్ర పొందవచ్చు. మద్యం తాగడం వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ పెరిగి చర్మంపై తొందరగా ముడతలు వస్తాయి. అలాగే డీహైడ్రేషన్ వల్ల ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఒకవేళ మీరు నెల రోజుల పాటు మద్యం మానేస్తే చర్మానికి రక్త ప్రసరణ బాగా జరిగి స్కిన్ గ్లో పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఒత్తిడి తగ్గేందుకు మద్యం తాగుతున్నామని కొంతమంది చెబుతుంటారు. కానీ మద్యం తాగితేనే ఒత్తిడి మరింత పెరుగుతుంది. నెల రోజుల పాటు ఆల్కహాల్ మానేసి చూడండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మద్యం తాగడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. కండలు ముట్టుకుంటే మెత్తగా, నొప్పిగా అనిపిస్తాయి. అదే ఆల్కహాల్ మానేస్తే కండరాల బలం పెరుగుతుంది. బాడీ కూడా ఫిట్‌గా కనిపిస్తుంది.
మద్యం తాగే వారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కోపం, చికాకు, బాధ..ఇలా తరచూ ఏదో ఒక రకంగా ఇబ్బందిపడుతుంటారు. కానీ మద్యం మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఆల్కహాల్ తాగేవారు బలహీనంగా ఉంటారు. బలం తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు నెల రోజులు మద్యం మానేసి చూడండి. శరీరం బలంగా అనిపిస్తుంది. హెల్తీగా కనిపిస్తారు. ఆల్కహాల్ తాగడం వల్ల మీకు తెలియకుండానే మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. తాగాలన్న కోరికతో ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ నెల రోజులు మద్యం మానేసి చూడండి. కచ్చితంగా మీ జేబులో డబ్బు నిలుస్తుంది.


































