UPI rule change: మీరు PhonePe, Google Pay వాడుతున్నారా? ఈ రోజు నుండి కొత్త నియమాలు ఇవే

ఇటీవల UPI లావాదేవీలు ఎక్కువయ్యాయి. అందరూ UPI ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త UPI రూల్స్ ప్రవేశపెట్టింది.


ఈ నియమాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. RBI గైడ్లైన్స్ ప్రకారం, UPI లావాదేవీలకు మరింత సురక్షితంగా ఉండేందుకు కొత్త భద్రతా చర్యలు తీసుకోబడ్డాయి. UPIతో లింక్ అయిన inactive మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేస్తారు. చాలా కాలంగా తమ మొబైల్ నంబర్‌తో UPI ట్రాన్సాక్షన్లు చేయని వారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఏప్రిల్ 1కి ముందు బ్యాంక్ వద్ద డిటైల్స్ అప్‌డేట్ చేసుకుంటే, UPI సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదు.

సెక్యూరిటీ సమస్యలను నివారించడానికి, బ్యాంకులు మరియు థర్డ్-పార్టీ UPI ప్రొవైడర్లు (PhonePe, Google Pay వంటివి) inactive నంబర్లను తమ సిస్టమ్ నుండి తీసివేయాలి.

ఇంకా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించి కొత్త నియమాలు ప్రవేశపెట్టబడ్డాయి. SBI, PNB, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఏప్రిల్ 1 నుండి కనీస బ్యాలెన్స్ నియమాలను మారుస్తున్నాయి. రిక్వైర్డ్ బ్యాలెన్స్ నిర్వహించని కస్టమర్లపై పెనాల్టీ విధించబడుతుంది.

కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం, ₹12 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించబడదు. ఈ కొత్త టాక్స్ విధానం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది.

2024 ఆగస్టులో ప్రారంభించబడిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా అమలులోకి వస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 23 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లాభం పొందుతారు.

కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ పాలసీలో మార్పులు చేస్తున్నాయి.