Btech చేసి ఖాళీగా ఉన్నారా?.. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. నెలకు 1,20,000 జీతం

www.mannamweb.com


ప్రస్తుతం టెకీలకు గడ్డుకాలం దాపరించింది. ఓ వైపు లే ఆఫ్స్, మరో వైపు కొత్త నియామకాలు లేక కెరీర్ అంధకారంలో పడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఎంప్లాయీస్ ను తొలగిస్తున్నాయి. ఉద్యోగావకాశాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి మీరు కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఈ అవకాశాన్ని వదలకండి. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. నిరుద్యోగులకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది.

ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్, మెకానిక్ విభాగాల్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,20,000 జీతం పొందొచ్చు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు ఫీజు రూ. 500. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 8 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు
06
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)- 03
అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్)-03
అర్హత:
అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి 1,20,000 వరకు అందిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను ది మేనేజర్ (హెచ్ ఆర్) రిక్రూట్ మెంట్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ:
08-05-2024