Viral Video: 30 చొక్కాలు వేసుకుని ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్.. ఇలా ఎందుకు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

www.mannamweb.com


Viral Video: 30 చొక్కాలు వేసుకుని ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్.. ఇలా ఎందుకు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: కొన్నిసార్లు సమాజంలో చట్ట బద్ధంగా ఉండే రూల్స్ పాటించడం అంటే ఎవరకీ ఇష్టం ఉండదు. అంతేకాదు వీటి నుండి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, బస్సు, రైలు ప్రయాణాలు వంటి వాటిల్లోను చాలా రకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎయిర్ పోర్టుల్లోను ఉండే రూల్స్ పాటించడానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు.

అందులో ముఖ్యంగా ఉండే రూల్ లగేజ్ చెకింగ్. లగేజ్ చెకింగ్ అంటేనే చాలా మంది ప్రయాణికులు భయపడుతుంటారు. ఎందుకంటే పర్యటనకు వెళ్లే వారు ఎక్కువ లగేజ్ తీసుకుని వెళ్తారు. ఈ తరుణంలో లగేజ్ వెయిట్ ఎక్కువ అయితే దానికి కూడా ఛార్జ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్న ఓ వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి ఏకంగా 30 చొక్కాలు ధరించి ఫ్లైట్ ఎక్కాడు. ఒక్కసారిగా ఫ్లైట్ ఎక్కిన అనంతరం తన లగేజ్ ను లోపల పెట్టి షర్ట్స్ విప్పడం ప్రారంభించాడు. ఈ తరుణంలో ఒకటి, రెండు, మూడు ఇలా ఒక దాని తర్వాత ఒకటి విప్పుతూనే ఉన్నాడు. ఎన్ని విప్పినా కూడా మరొకటి వస్తూనే ఉంది. దీంతో మొత్తం 30 చొక్కాలను వేసుకుని ఫ్లైట్ ఎక్కాడు. తన లగేజ్ వెయిట్ ఎక్కువగా ఉండడంతో దానికి డబ్బులు చెల్లించడం ఇష్టం లేక ఆ వ్యక్తి ఈ పని చేశాడు. అయితే ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.