సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

www.mannamweb.com


భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును సాధించాడు. తాజాగా సచిన్‌ టెండూల్కర్‌(sachin tendulkar) పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాన్పూర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుటయ్యే ముందు ఈ రికార్డును నెలకొల్పాడు. దీంతో కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 27000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

సచిన్ రికార్డ్ బ్రేక్

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ 594 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక టెండూల్కర్ 2007లో 623 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించాడు. శ్రీలంక ఆటగాడు సంగక్కర 2015లో తన 648వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించగా, ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ తన 650వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని దక్కించుకున్నారు.

బీసీసీఐ

ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జే షా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఇది విరాట్ కోహ్లీ కెరీర్‌లో మరో అద్భుతమైన కీలక మైలురాయి అని పేర్కొన్నారు. కోహ్లీ 27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందన్నారు.

కోహ్లీ ఇప్పటివరకు

కోహ్లీ టెస్టుల్లో 8,870కి పైగా పరుగులు చేయగా, 295 వన్డేల్లో 13,906 పరుగులు, 125 టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో ఆడిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ గేమ్‌లోని పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో 10 వేల పరుగులు చేశాడు.

ఈసారి కూడా మిస్

విరాట్ కోహ్లీ 27 వేల పరుగుల ఫిగర్‌ని టచ్ చేసినా కాన్పూర్‌లో మాత్రం అర్ధ సెంచరీని అందుకోలేకపోయాడు. విరాట్ 35 బంతుల్లో 47 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. స్లాగ్‌స్వీప్‌ ఆడుతున్న సమయంలో విరాట్‌ కోహ్లీ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్‌లో కూడా ఈ కరువు తీరలేదు.