విశాఖ టూ కశ్మీర్.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు

కశ్మీర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే వైజాగ్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్లాన్ ఇంది.

మార్చిలో ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని కొందరు ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ టూ కశ్మీర్ టూర్ ప్లాన్ చేసింది. 6 పగళ్లు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో చాలా ప్రాంతాలను కవర్ చేస్తారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్(IRCTC) 13 మార్చి 2026న విశాఖ నుంచి టూర్ అందిస్తుంది. ఆరు రోజుల ఎయిర్ ప్యాకేజీ టూర్‌. మార్చి 13వ తేదీన ఉదయం 9 గంటలకు టూర్ మెుదలవుతుంది. మార్చి 18వ తేదీన రాత్రి 8:35 గంటలకు టూర్ ముగుస్తుంది.


డే 1

విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హోటల్‌కు చెక్-ఇన్ అవుతారు. భోజనం తర్వాత, షికారా రైడ్ (మీ స్వంత ఖర్చుతో). హోటల్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 2

హోటల్‌లో అల్పాహారం తర్వాత సోన్‌మార్గ్‌కు పూర్తి రోజు పర్యటనకు బయలుదేరుతారు. వేసవి నెలల్లో ప్రధాన ఆకర్షణ అయిన తాజివాస్ హిమానీనదం వరకు ప్రయాణానికి పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రం శ్రీనగర్‌కు తిరిగి వెళ్తారు. హోటల్‌లో డిన్నర్ చేసి రాత్రి బస చేస్తారు.

డే 3

అల్పాహారం తర్వాత గుల్మార్గ్‌కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో పచ్చిక బయళ్ళు కనిపిస్తుంటాయి. ఖిలాన్‌మార్గ్ వరకు ఒక చిన్న ట్రెక్. శ్రీనగర్‌కు తిరిగి వెళ్తారు. హోటల్‌లో డిన్నర్, రాత్రి బస చేస్తారు.

డే 4

అల్పాహారం తర్వాత పహల్గామ్‌కు వెళ్తారు. దారిలో కుంకుమ పూల తోటలు, అవంతిపుర పురాతన పట్టణం చూస్తారు. మధ్యాహ్నం పహల్గామ్ సందర్శనా స్థలం వెళ్తారు. పహల్గామ్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 5

అల్పాహారం తర్వాత శ్రీనగర్‌కు వెళ్తారు. శంకరాచార్య ఆలయాన్ని సందర్శించండి. దర్శనం తర్వాత, మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్‌లను సందర్శించండి. తరువాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్‌బాల్ పుణ్యక్షేత్రానికి వెళ్తారు. సాయంత్రం సూర్యాస్తమయం, చార్-చినార్ ఆస్వాదించడానికి షికారా దాల్ సరస్సుపై ప్రయాణిస్తారు. హౌస్‌బోట్‌లో చెక్ ఇన్ చేస్తారు. హౌస్‌బోట్‌లో డిన్నర్, రాత్రి బస చేస్తారు.

డే 6

హౌస్‌బోట్‌లో అల్పాహారం చేసి చెక్అవుట్ చేస్తారు. శ్రీనగర్ విమానాశ్రయానికి వెళ్తారు. తర్వాత విమానంలో ఎక్కి విశాఖపట్నం చేరుకుంటారు. ఇంతటితో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

ఒక్కొక్కరికి (సింగిల్ ఆక్యుపెన్సీ) రూ.56070, రూ.45915(డబుల్ ఆక్యుపెన్సీ), రూ.44490 (ట్రిపుల్ ఆక్యుపెన్సీ)గా ధరలు ఉన్నాయి. పిల్లలకు (5 నుండి 11 సంవత్సరాలు) రూ.38985 (బెడ్‌తో), రూ.36365 (బెడ్‌ లేకుండా)గా ధర నిర్ణయించారు.

పర్యాటకులు పర్యటన సమయంలో వారి వ్యక్తిగత ఐడీ కార్డులు (ఒరిజినల్) తీసుకెళ్లాలి. ఈ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, హౌస్ బోట్‌లో ఒక రాత్రి బసతో సహా హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, వాహనం ద్వారా రవాణా, టూర్ సమయంలో ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సర్వీస్, ప్రయాణ బీమా, టోల్ పార్కింగ్, పన్నులు ఉంటాయి.

సంప్రదించాల్సిన నెంబర్లు

చందన్ : 9281030748, సాయి ప్రసాద్ : 9281495847, వెంకట్ : 9550166168, సాయి జీవంతి : 8978931964. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌, ప్లాట్ ఫామ్ నెంబర్ 1, ఏపీటీడీసీ కౌంటర్ పక్కన, విశాఖపట్నం-53లో సంప్రదించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.