ఖతర్నాక్ ఫీచర్లతో వివో Y39 5G ఫోన్ వచ్చేస్తోంది.

లాంచ్‌కు ముందుగానే కలర్ ఆప్షన్లు, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.


కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారతీయ మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. గత ఫిబ్రవరిలో మలేషియాలో ఆవిష్కరించిన వివో Y39 5G త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ గురించి ఎలాంటి అధికారిక వివరాలను రివీల్ చేయలేదు.

ఇటీవలి రిపోర్టు ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ భారతీయ వేరియంట్ ధరతో పాటు కొన్ని ముఖ్య ఫీచర్లను సూచించింది. మలేషియా డిజైన్ మాదిరిగానే ఉండొచ్చు. 8GB ర్యామ్ కలిగిన క్వాల్‌కామ్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 SoC ద్వారా పవర్ పొందుతుంది. ముఖ్యంగా, గత మోడల్ వివో Y38 5G ఉన్న అదే చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో వివో Y39 5G ధర, కలర్ ఆప్షన్లు (అంచనా) :
భారత మార్కెట్లో వివో Y39 5G ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999గా ఉండొచ్చు. ఇంతలో, 8GB + 256GB ఆప్షన్ ధర రూ. 19,999గా ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందించవచ్చు. లీక్ ప్రమోషనల్ ఫొటోల ద్వారా ఈ వివరాలలో కొన్ని బయటపడ్డాయి.

వివో Y39 5G ముఖ్య ఫీచర్లు (అంచనా) :
నివేదిక ప్రకారం.. వివో Y39 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 264ppi పిక్సెల్ డెన్సిటీతో HD+ (720 x 1,608 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. మలేషియా వేరియంట్ 6.68-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.

భారతీయ వెర్షన్ 8GB ర్యామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC కలిగి ఉండవచ్చు. 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లకు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. కెమెరా సెగ్మెంట్‌లో వివో Y39 5G భారతీయ వేరియంట్‌లో 50MP సోనీ రియర్ సెన్సార్‌తో పాటు 2MP బోకె లెన్స్, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు.

వివో Y39 5G ఫోన్ భారతీయ వేరియంట్‌లో 44W ఫ్లాష్‌చార్జ్‌కు సపోర్టుతో 6,500mAh బ్యాటరీని అందించనుంది. 5 ఏళ్ల బ్యాటరీ హెల్త్ సర్టిఫికేషన్‌తో వస్తుందని భావిస్తున్నారు. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను పొందే అవకాశం ఉంది.