మీకు అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 మధ్యలో మెలుకవ వస్తుందా..? ఐతే ఇదే సంకేతం..!!
కొంతమందికి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలుకవ వస్తుంది. ఇలా మెలుకవ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయ్. ఇది భగవంతుడు ఇస్తున్న సందేశం.
ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు. ఇలా మీకు మెలుకవ రావడం వెనక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు. ఇలా మెలుకవ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయ్. అసలు మూడు గంటల నుంచి 5 గంటల మధ్య మెలుకవ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం.
మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి కచ్ఛితమైన సమాధానాలను చెబుతుంది. చాలా మందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంగా వారు నిద్రలేవలేరు. వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు. ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ద మందికి మాత్రమే లభిస్తుంది. ఇది దేవుడు నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థంచేసుకోవాలి.
3 గంటల నుంచి 5 గంటల మద్య కాలాన్ని ఉదయం బ్రహ్మముహూర్తం అని అంటారు. ఇది చాలా మహత్తరమైన కాలం. దీనికి అమృతకాలమని పేరు కూడా ఉంది. పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షన ఉంటుంది. వీరికి ఎలాంటి రోగాలూ రావు.
వీరు చాలా నిజయితీగా ఉంటారు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఏపని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచేవారికి రాగద్వేశాలు ఉండవు. కపటులు కూడా వీరికి నచ్చరు. ఎవ్వరి మనసును కూడా బాధపెట్టరు. ఎవ్వరితో కఠినంగా కూడా మాట్లాడరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు. జీవితభాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ గుణాలు వున్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలుకవ వస్తుంది.
సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరనివాసం చేస్తుంది. సూర్యోదయానికి ముందే లేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయ్. సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఎవరిమీదైతే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది. సూర్యుడిని కామధేనువుతో శాస్త్రాల్లో పోల్చారు. సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. మీ జీవతంలో కష్టాలు తొలగిపోయి, సుఖసంతోషాలు రానున్నట్లని అర్థం చేసుకోవచ్చు. సర్యోదయానికంటే ముందే లేచి గోమాత దర్శనం అయిన వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రపంచం మాయలో పడి చాలా మంది భగవంతుడికి దూరమౌతారు. పూజలు కేవలం చూపించడానికి మాత్రమే చేస్తారు. మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకవ వస్తుందంటే మీరు అప్పుడే లేచి ఈ కులదైవాన్ని పూజించినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది.