మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు ఒకటి. మిల్లెట్లను వివిధ మార్గాల్లో, పలు ఆహార పదార్థాలలో వినియోగిస్తారు.
రాగిపిండితో ఎన్నో ప్రయోజనాలున్నాయి… రాగి ముద్ద, రాగి రోటీ, రాగి గంజి, రాగి అంబలి ఇలా పలు రకాలుగా తయారు చేసుకోని తీసుకుంటారు. మిల్లెట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లల సరైన అభివృద్ధికి కూడా ఉపయోగపడుతాయి.. వృద్ధులు, మహిళలు ఎముకల బలానికి మిల్లెట్ మాల్ట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రాగి గంజి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మిల్లెట్ మాల్ట్ ఎముకల బలానికి మినరల్స్ ఏర్పడటానికి బాగా దోహదపడుతుంది. రాగి మాల్ట్ తాగితే మన శరీరానికి శక్తి వస్తుంది. రాగుల్లోని పోషకాలు ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, మినరల్స్ మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ట్రిప్టోఫాన్, ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీని వినియోగం బరువును అదుపులో ఉంచుతుంది. మిల్లెట్ పిండితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. రాగులు గుండె బలహీనత, ఉబ్బసాన్ని తగ్గిస్తాయి.
రాగులతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల వృద్ధాప్యంలో శరీరానికి బలం చేకూరుతుంది. మిల్లెట్ ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ, మృదువుగా మారుతుంది.. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. గంజి, పాలతో కలిపిన మిల్లెట్ మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ ఉంచవచ్చు..
మిల్లెట్ ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు, ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడేవారికి ఫైబర్ అధికంగా అందుతుంది..