శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడం, స్లిమ్‌డ్ లుక్‌ని పొందడం కోసం చాలా మందిక ఓ యుద్ధమే చేస్తుంటారు. కొందరు స్లిమ్‌గా ఉండటానికి జిమ్‌కి వెళతారు..
మరి కొందరు యోగా చేస్తారు.. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే బయటి ఆహారాన్ని మానేసి కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడానికి ఈ విధమైన టఫ్ ఫైట్ చేయడం వల్ల మానసిక అలసటతో కూడా బాధపడుతుంటారు.
మెంతుల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్ధం త్వరగా బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన మెంతులను మార్కెట్‌లో కొనే బదులు ఇంట్లోనే ఎండు మెంతిపొడిని గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిని వేడి నీటిలో కలిపితే సరిపోతుంది. దీనితో నిమ్మరసం, తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. బరువు తగ్గడానికి ఈ పానీయం బలేగా పనిచేస్తుంది.
ఉదయం పూట ముందుగా టీ తాగే అలవాటు ఉన్నవారు.. దీనికి బదులుగా మెంతి పొడిని కలుపుకుని తాగవచ్చు. ఈ టీని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. కానీ చేదును తగ్గించడానికి ఇందులో చక్కెర కలుపుకోకూడదు. బదులుగా ఏలకులు లేదా అల్లం జోడించవచ్చు. ఈ టీని ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి.
మెంతి గింజలను తీసుకుని వాటిని ఒక గిన్నెలో తడి గుడ్డతో కప్పాలి. గుడ్డ ఎండిపోకుండా జాగ్రత్తగా తడి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మెంతి గింజలు 2-3 రోజుల్లో మొలకెత్తుతాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఈ మొలకెత్తిన మెంతికూర తింటే త్వరగా బరువు తగ్గుతారు.