ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2).
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో మాటల్లో చెప్పలేం..దీనికి ఉదాహరణే అడ్వాన్స్ బుకింగ్ తో వచ్చిన రూ 100 కోట్లు. ఇది చాలు సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తి తో ఉన్నారో చెప్పడానికి..ఈ క్రమంలో పుష్ప 2 ను అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేశ్‌బాబు (Janasena Leader Chalamalasetty Ramesh Babu) హెచ్చరించడం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. “పుష్ప-2” చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సినిమాను తీవ్రంగా ప్రతిఘటించుతామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన శ్రేణులు కూడా తన పక్షాన నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ భేదాలపై చర్చ :
అల్లు అర్జున్ ఇటీవల ఇచ్చిన కొన్ని ప్రకటనలు చిరంజీవి అభిమానుల మనోభావాలను దెబ్బతీసినట్లు జనసేన నేత అభిప్రాయపడ్డారు. చిరంజీవి కృషికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, ఆయనకు తగిన రీతిలో స్పందించకపోవడం వల్లే ఈ వివాదం తలెత్తిందని రమేశ్‌బాబు అన్నారు. ఇది మామూలు విషయం కాదని, మెగాస్టార్ అభిమానులు సైతం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు.
పుష్ప-2పై ప్రభావం ఉంటుందా..?
“పుష్ప-2” సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తోంది. అయితే, జనసేన నేతల తాజా హెచ్చరికలు ఈ చిత్రానికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వివాదం అభిమాన వర్గాలను కుదిపి సినిమాకు బోయ్‌కాట్ పిలుపు వరకూ దారితీయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
జనసేన నేత వైఖరిపై విమర్శలు
చలమలశెట్టి రమేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసిన ఈ విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమా, లేక నిజమైన అభిప్రాయాలా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఒక సినిమా విడుదలను అడ్డుకోవడమా లేదా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమా అన్నదానిపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం ఇంకా ముదరకుండా, ఇరువురు వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకొని సమస్యను సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి. చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో మెగా కుటుంబం పెద్దలు కూడా చొరవ చూపాలి. ఇలాంటివి దూరం పెంచేవి కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క స్ఫూర్తిని పెంపొందించేలా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!