ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చిన్న వయసులో కూడా అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు.
దానికి ఆహారపు అలవాట్లు అధిక కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య సమస్యల కారణంగా లేదంటే లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఇలా అధికంగా బరువు పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతుంటారు. అసలు బరువు తగ్గాలంటే ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు.
కొందరు గంటల కొద్దీ జిమ్ లో కష్టపడ్డా సరే సన్నగా మారలేక ఇబ్బందులు పడుతుంటారు. అంతే కాకుండా అధిక బరువు తగ్గించుకోవడానికి తిండి తగ్గిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ గంటలు వ్యాయామాలు చేయడం బోరింగ్ పని. అంతే కాకుండా ప్రత్యేకమైన ఆహారాలు రెడీ చేసుకునేంత సమయం కూడా లేదు. కాబట్టి చాలా సింపుల్ గా బరువు తగ్గాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికోసం ఇప్పుడు మేం ఓ మంచి చిట్కా చెబుతున్నాం. అదే నీరు తాగడం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నీళ్లు తాగడం వల్ల కూడా సులభం బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును కరిగిస్తుంది…
తగినంత నీరు తాగడం వల్ల బాడీలో కొవ్వును కరించేస్తుంది మన బాడీ. అసలు నీళ్లు సరిగ్గా తాగకపోతే బాడీలో నిల్వ ఉన్న కార్పొహైడ్రేట్లు, కొవ్వు పదార్తాలను జీర్ణం చేయదు మన బాడీ. కానీ నీళ్లను తాగడం వల్ల కొవ్వు పదార్థాలను మన బాడీ కరిగించేసుకుంటుంది.
కేలరీలను తగ్గిస్తుంది…
చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగంగా మారుతుంది. దాంతో ఈజీగా తిన్న ఆహారం కరిగిపోతుంది. దాని వల్ల బాడీలో కొవ్వు పదార్థాలు పెరగకుండా ఉంటుంది. అంతే కాకుండా చల్లటి నీళ్లు తాగడం వల్ల వాటర్ ను వేడి చేయడానికి మన బాడీ లోపల ఉన్న కేలరీలను బర్న్ చేస్తుంది. దాని వల్ల కూడా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.
ఆకలిని తగ్గిస్తుంది..
అధికంగా నీరు తాగడం వల్ల కూడా ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనం చేయడానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. దాంతో మన పొట్ట నిండుగా అనిపించి మన బాడీ తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది. దాని వల్ల అనవసర వ్యర్థ పదార్థాలు మన బాడీలో పేరుకు పోకుండా ఉండి బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.
ఎంత నీరు తాగాలి..?
అయితే చాలా మందికి అసలు మనం రోజులో ఎంత నీరు తాగాలి అనేది కూడా తెలియదు. మన శరీర బరువును బట్టి నీళ్లు తీసుకోవాలి. అలా కాకుండా బరువుతో సంబంధం లేకుండా తక్కువ నీరు తాగితే అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రతి మనిషి ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఇంకా ముఖ్యం. 30 నిమిషాల వ్యాయామం చేసి సుమారు 350 ml నీరు తాగితే ఎలాంటి బరువు అయినా తగ్గించుకోవచ్చు.