షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగితే ఏం జరుగుతుంది

మామూలుగా డయాబెటిస్ పేషెంట్లు ఆహార పదార్థాల విషయంలో చాలా భయపడడంతో పాటు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. కొందరు టీలు కాఫీలు విచ్చలవిడిగా తాగితే మరి కొందరు టీ కాఫీ తాగడానికి కూడా భయపడుతూ ఉంటారు.


అయితే బెల్లం టీ తాగవచ్చా తాగుకూడదా అన్న సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. మరి డయాబెటిస్ పేషెంట్లు బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టీ చాలామందికి ఇష్టమైన డ్రింక్ అని చెప్పాలి. కనీసం రోజుకు 4, 5 సార్లు కూడా టీ తాగుతుంటారు. కానీ షుగర్ పేషెంట్ల పరిస్థితి ఇందుకు భిన్నం.

వాళ్లు టీ తాగితే జబ్బును ఇంకా పెంచుకున్నట్లే అని చెప్పాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి తీపి పదార్థాలు తినకూడదట. అది వాళ్ల ఆరోగ్యానికి అసలే మంచిది కాదని చెబుతున్నారు. ఎన్ని పోషకాలు ఉన్నా తినకూడదట. అందులో బెల్లం కూడా ఒకటి. బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి. కానీ బెల్లంలో గ్లూకోజ్, సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందట. కాగా డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం తీసుకుంటే చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుందట. దీంతో ఇన్సులిన్ స్థాయి దెబ్బతింటుందట.

షుగర్ కంట్రోల్ లో ఉంటే అప్పుడప్పుడు బెల్లం టీ తాగవచ్చని చెబుతున్నారు. షుగర్ ఉన్నవాళ్లకు తీపి పదార్థాల మీద కోరిక ఉంటే ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవచ్చు. పాల టీకి బదులుగా హెర్బల్ టీ తాగొచ్చు. ఆపిల్ ఆరెంజ్ లాంటివి మితంగా తినవచ్చని చెబుతున్నారు. మాకు షుగర్ కంట్రోల్ లో ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వారు ఎప్పుడూ ఒకసారి తాగవచ్చని చెబుతున్నారు. ఈ విషయం పట్ల మీకు మరిన్ని సందేహాలు ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకొని ఆ తర్వాత బెల్లం టీ తాగడం మంచిది అని చెబుతున్నారు.