మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మళ్లీ ముట్టరు..

వంటగదిలో అత్యంత సాధారణంగా కనిపించే కూరగాయలలో బంగాళాదుంప ఒకటి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలు మొలకెత్తుతాయి. దుకాణాల నుంచే మొలకలతో కూడిన దుంపలను ఇంటికి తీసుకురావడం కూడా జరుగుతుంది.


ఇలాంటి మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం సురక్షితమేనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల తీవ్రమైన ప్రాణాపాయ సమస్యలు రాకపోయినా, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గ్లైకోఆల్కలాయిడ్స్ అనే విషాలు

బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు వాటిలో గ్లైకోఆల్కలాయిడ్స్ అనే స్వల్పంగా విషపూరితమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విషాలను తీసుకోవడం వల్ల అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే అసిడిటీతో బాధపడుతున్న వారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ విష పదార్థాలు ఆమ్లత్వాన్ని మాత్రమే కాకుండా కడుపు నొప్పి, వికారం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తాయి.

మొలకలు చిన్నగా ఉంటే ఏం చేయాలి?

వైద్యుల సలహా ప్రకారం.. మొలకలు చాలా చిన్నగా ఉంటే వాటిని పూర్తిగా తొలగించి, బంగాళాదుంపలను తినవచ్చు. దీనివల్ల సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే.. మొలకలు చాలా పెద్దగా ఉంటే వాటిని తినకపోవడమే మంచిది. పెద్ద మొలకల ద్వారా ఎక్కువ గ్లైకోఆల్కలాయిడ్స్ శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు తీవ్ర ప్రమాదం!

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పెద్ద మొలకలు ఉన్న బంగాళాదుంపలను తినడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దుంపలు తినడం వల్ల గర్భంలోని శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే గర్భిణీ స్త్రీలు మొలకెత్తిన బంగాళాదుంపలను పూర్తిగా నివారించడం శ్రేయస్కరం.

తినవలసి వస్తే.. చేయవలసిన పని

సాధ్యమైనంత వరకు పచ్చి బంగాళాదుంపలు మొలకెత్తిన వెంటనే వాటిని తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వాటిని తప్పనిసరిగా తినవలసి వస్తే..మొలకలను పూర్తిగా కత్తిరించి పారేయాలి. దుంపల తొక్కను పూర్తిగా తొలగించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా బంగాళాదుంపలో ఉండే విషపూరిత గ్లైకోఆల్కలాయిడ్స్ మొత్తాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.