బెల్లం కేవలం తీపి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు.. ఇది నిజానికి ఒక సూపర్ ఫుడ్ లాంటిది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
సహజ తీపి కలిగి ఉండటం వల్ల ఇది ప్రాసెస్ చేసిన చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెబుతారు. బెల్లం గురించి చాలా మందిని గందరగోళానికి గురి చేసే ఒక ప్రశ్న.. దీన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలా? అని.. ఈ విషయం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బెల్లం నిల్వ చిట్కాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెల్లం నిల్వ విషయంలో పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి:
సాధారణంగా ఫ్రిజ్‌లో వద్దు: బెల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయమని సాధారణంగా సిఫార్సు చేయరు. ఫ్రిజ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బెల్లం నాణ్యత తగ్గి, త్వరగా పాడువుతుంది.అంతేకాక బూజు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
సరైన నిల్వ పద్ధతి: బెల్లం నిల్వ చేయడానికి అత్యంత సరైన మార్గం ఏమిటంటే.. దానిని తేమ నుండి రక్షించడం. దీని కోసం బెల్లాన్ని వంటగదిలో గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి. గాలి, తేమ లోపలికి రాకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం.
ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి: వర్షాకాలం లేదా అత్యంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బెల్లం త్వరగా కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో దానిని పూర్తిగా గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం బెల్లం ప్రయోజనాలు
ఆయుర్వేద నిపుణురాలు కిరణ్ గుప్తా.. బెల్లం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అందుకే రాత్రి భోజనం తర్వాత బెల్లం తినాలని ఆమె సిఫార్సు చేస్తారు.
సహజ డిటాక్సిఫైర్: బెల్లం సహజ డిటాక్సిఫైగా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీర్ణ సమస్యలు: ఇది మలబద్ధకం, వాయువు వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
రోగనిరోధక శక్తి: బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కాలేయ శుద్ధి: ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది.
మంచి ఆరోగ్యం కోసం, వంటలో చక్కెర స్థానంలో బెల్లాన్ని ఉపయోగించడం, రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.
































