పగటిపూట నిద్రపోతే ఏమవుతుంది.. చిన్న కునుకుతో ఇన్ని జరుగుతాయా..?

రోగ్యంగా చురుకుగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే నేటి వేగవంతమైన జీవనశైలి, రాత్రి వేళల్లో పని ఒత్తిడి, టెక్నాలజీ వినియోగం వంటి కారణాల వల్ల చాలా మందికి ఆ ఎనిమిది గంటల నిరంతర నిద్ర లభించడం కష్టంగా మారింది.


ఈ పరిస్థితిలో నిద్ర లేమిని భర్తీ చేసుకోవడానికి చాలా మంది బైఫాసిక్ లేదా పాలీఫాసిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అంటే, రాత్రిపూట నిద్ర తక్కువైతే, పగటిపూట నిద్రపోవడం ద్వారా దాన్ని భర్తీ చేసుకుంటున్నారు.

రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ ఉద్యోగ ఒత్తిడి, టెక్నాలజీ వాడకం వంటి కారణాల వల్ల చాలా మందికి ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి వారికి నిద్ర నిపుణులు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని సూచిస్తున్నారు: అదే *బైఫాసిక్ నిద్ర. సాధారణంగా రాత్రి ఒకేసారి ఎక్కువసేపు నిద్రపోవడాన్ని అనుసరిస్తాం. కానీ ఈ కొత్త పద్ధతిలో రాత్రి కొద్దిసేపు, పగటిపూట కొంతసేపు నిద్రపోవడం ద్వారా మొత్తం నిద్ర లేమిని భర్తీ చేసుకోవచ్చు.

సైన్స్ ఏం చెబుతోంది?

నేచర్ సైంటిఫిక్ రిపోర్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్రను ఇలా రెండు భాగాలుగా విభజించడం వల్ల మెదడుపై మంచి ప్రభావం ఉంటుంది. పగటిపూట చిన్న కునుకు తీయడం వల్ల దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఈ నిద్ర వల్ల శరీరంలో నిద్ర లేమి కారణంగా ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాత్రి నిద్ర సరిపోని వారు పగటి నిద్ర ద్వారా ఎనిమిది గంటల నిరంతర నిద్ర పొందినంత చురుకుదనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

సాంప్రదాయ నిరంతర నిద్ర అనేది సహజ సిర్కాడియన్ లయలకు అనుగుణంగా ఉంటుంది. ఇది గాఢ నిద్ర, వేగవంతమైన కంటి కదలిక దశలతో సహా అన్ని నిద్ర చక్రాల ద్వారా శరీరం సజావుగా సాగడానికి వీలు కల్పిస్తుంది. ఈ స్థిరమైన నిద్ర హార్మోన్ విడుదల, హృదయనాళ నిర్వహణ, జ్ఞాపకశక్తి ఏకీకరణకు మద్దతు ఇస్తుంది, రోజంతా ఊహించదగిన శక్తి స్థాయిలను ఇస్తుంది.

ఎవరికి ఇది మంచిది?

ఈ పద్ధతి ముఖ్యంగా షిఫ్టుల్లో పనిచేసే వారికి ఇంటి బాధ్యతలు ఉండి రాత్రి ఎక్కువసేపు నిద్రపోలేని వారికి లేదా స్థిరమైన నిద్ర సమయం లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా, కోల్పోయిన విశ్రాంతిని అందిస్తుంది. కాబట్టి నిద్రను ఒకేసారి కాకుండా రోజులో రెండుసార్లు విభజిస్తే మీ మెదడు పనితీరు మెరుగుపడుతుందని, మీరు మరింత శక్తివంతంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.