Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?

What is Brahma Muhurta? What is special about this moment?


Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలా మంది నోటి నుంచి వినే ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విగ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు.
పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు.

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి?

సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే..

బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు.

బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది?

బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు.
పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.