నేటి కాలంలో చాలామంది రకరకాల కారణాల వల్ల అప్పులు చేస్తున్నారు. కొందరు ఇల్లు నిర్మాణం కోసం.. మరికొందరు చదువుల కోసం.. ఇంకొందరు ఇంట్లో అవసరాల కోసం అప్పులు చేయక తప్పడం లేదు.
ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే వీటిని తీర్చడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఒక్కోసారి ఆదాయం వచ్చినట్లే వచ్చి మళ్లీ ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి కానీ.. అవి పూర్తి కావడం లేదు. ఇలాంటి సమయంలో దైవానుగ్రహం ఉండడం వల్ల కాస్త ఉపశమనం అయ్యే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ దైవానుగ్రహాల్లో ఎవరు అప్పులు తీరుస్తారంటే?
శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే. వీటిలో నరసింహ అవతారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి నరసింహుడు స్తంభం నుంచి బయటకు వచ్చిన కథ అందరూ వినే ఉంటారు. అలాంటి నరసింహుడు ఆగ్రహరూపం మాత్రమే కాకుండా భక్తుల అవసరాలను కూడా తీరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా తనను నమ్మిన భక్తుడికి ఎటువంటి ప్రాణహాని కూడా జరగకుండా కాపాడుతాడు. నరసింహుడి అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకంగా అలంకరణలు అవసరం లేదు. హోమాలు అంతకన్నా అవసరం లేదు.. కేవలం భక్తితో పూజిస్తే చాలు. ఇలా పూజించడం వల్ల ఒక వ్యక్తి జీవితం సరైన మార్గంలో వెళ్లడమే కాకుండా అప్పులు కూడా తీరడానికి సహాయపడతాడు.
సకల పాపాలను తొలగించే నరసింహస్వామి ఒక వ్యక్తికి ఉన్న అప్పుల బాధ నుంచి కూడా విముక్తి కల్పిస్తాడు. అయితే ఈ విముక్తి కలగాలంటే ఆ స్వామి వారిని ప్రత్యేకంగా కొలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి బుధవారం నరసింహ స్వామికి సంబంధించిన స్తోత్రం చదవడం వల్ల ఆ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు.
‘ ఓం శ్రీ హ్రీం కమ్లే కమలాలయే ప్రసీద్ రసీదు శ్రీ హ్రీం శ్రీ ఓం మహా లక్ష్మ యై నమః’ ఈ మంత్రమును ప్రతి బుధవారం నాడు లేదా ప్రతిరోజు చదవడం వల్ల అప్పుల బాధ ఉన్నవాళ్లు కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు తెలుపుతున్నారు. అలాగే అనుకోకుండా గానీ.. అనుకోని గాని.. నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శించడం వల్ల తమకు ఉన్న కష్టాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మృత్యు గండాలను కూడా తొలగించే స్వామి నరసింహ స్వామి అని అంటున్నారు. నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శించినప్పుడు పరమభక్తితో ఒక పుష్పం సమర్పించిన స్వామి సంతోషిస్తాడని.. భక్తితో ఏం చేసినా నరసింహస్వామి అనుగ్రహం ఉంటుందని అంటారు.































