చికెన్ లేదా మటన్ లివర్‌ ఏది డేంజర్.. వీరికి విషంతో సమానం

నాన్ వెజ్ ప్రియులకు వారానికి ఒక రోజు మాంసం తినే అలవాటు సర్వసాధారణం. ఈ క్రమంలోనే చికెన్ లివర్, మటన్ లివర్‌లను ఎక్కువగా తింటుంటారు. ఈ రెండు ఆహార పదార్థాలలో అనేక పోషకాలు దాగున్నాయి.


అందుకే మాంసాహారం ఇష్టపడే చాలామంది చికెన్, మటన్ లివర్‌ను ఇష్టంగా తింటారు. అయితే, వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది, ఎవరు వీటిని తినకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా.. చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ లివర్‌లో ఐరన్, సెలీనియం, విటమిన్ ఏ, బీ12, ఫోలేట్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా, విటమిన్ ఏ, బీ12 కంటి ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఉడికించిన చికెన్ లివర్‌ను మితంగా తినడం వల్ల శరీర కొవ్వు తగ్గుతుందని చెబుతుంటారు.

మటన్ లివర్ విషయానికి వస్తే.. చాలామంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. మటన్ లివర్‌లో విటమిన్లు ఏ, డీ, బీ12, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి మటన్ లివర్ ఒక మంచి ఆహారం అని చెప్పొచ్చు. ఇది రక్త స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బీ12 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. అయితే ఇన్ని పోషకాలు ఉన్న చికెన్, మటన్ లివర్‌ను కొందరు తినకూడదు. అలా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు చికెన్ లేదా మటన్ లివర్‌ను తినకూడదు. ఈ వ్యక్తులు తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.