White Hair: ఒకప్పుడు ఆరు పదుల వయసులో కానీ తెల్ల జుట్టు కనిపించేదు కాదు.. కానీ ఇప్పుడు మూడు పదుల వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.. కేశాలపై సరైన శ్రద్ధ తీసుకోక పోతే చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది..
అలా అని మార్కెట్ లో దొరికే ఆయిల్స్ వాడమని కాదు.. మన ఇంట్లో దొరికే ఈ వస్తువులతో నూనె తయారు చేసుకుని.. ఆ నూనె వారంలో రెండుసార్లు రాసుకుంటే తెల్ల జుట్టు మాయం..!
తెల్ల జుట్టు నల్లగా మార్చే హెన్నా నూనె..
నువ్వుల నూనె 50 గ్రాములు, ఉసిరి పొడి ఒక స్పూన్, మునగ ఆకు పొడి ఒక స్పూన్, మెంతి పిండి ఒక స్పూన్, హెన్నా పొడి ఒక స్పూన్.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నువ్వుల నూనె పోసి ఉసిరి పొడి, మునగ ఆకు పొడి, మెంతి పిండి, హెన్నా పొడి వేసి కలపాలి.
ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఆ నూనె ను 5 నిమిషాల పాటు మరిగించాలి.. అలాగే ఒక 4 గంటల పాటు ఆ నూనె ను అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను వడపోసుకోవలి. ఆ నూనె ను ఒక గ్లాసు సీసాలో నిల్వ చేసుకోవాలి..
ఇలా తయారు చేసుకున్న హెన్నా నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఇలా రాత్రి పూట రాసుకుని ఉదయం మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలిపోవడం ఆపి ఒత్తుగా పెరుగుతుంది.