ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారీగా ఆగిపోతాయంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
ఓ ఛానల్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలో ఆర్బీఐ రూ.500 నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి నిలిపివేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఈ నకిలీ ప్రచారం పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ”ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రూ.500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి” అని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచించింది.
































