భారత్‌-పాక్ మ్యాచ్ లేకుండానే ప్రపంచకప్ షెడ్యూల్.. ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

www.mannamweb.com


U19 Women T20 World Cup 2025: ఐసీసీ టోర్నీ ఉందంటే, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆ టోర్నీని చూడలేం. కానీ, ఇప్పుడు చెప్పేది వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది.

కానీ ఆశ్చర్యపోకండి. ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025లో మహిళల క్రికెట్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉండదు. ఐసీసీ రెండు జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచింది. ఈ నిర్ణయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా పోటీ నడుస్తోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీక్షకుల సంఖ్యను పెంచడానికి ICC దీనిని సద్వినియోగం చేసుకుంటుంది. ప్రతి టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా, పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో ఉంచుతుంది. అయితే, ఈసారి అలా జరగదు.

16 జట్లతో ట్రోర్నీ.. సమోవా అరంగేట్రం..

మహిళల క్రికెట్ అండర్-19 ప్రపంచ కప్ జనవరి 18, 2025 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి మలేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 మాదిరిగానే ఈసారి కూడా 16 జట్లు పాల్గొనబోతున్నాయి. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. అన్ని జట్లు జనవరి 13, 16 మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. సమోవా జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీలో అరంగేట్రం చేయబోతోంది. ఇంతకు ముందు సమోవా ఐసీసీ టోర్నీ ఆడలేదు.

ఇండియా-పాకిస్థాన్ గ్రూపులో ఎవరున్నారు?

ఈ టోర్నీలో 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ గ్రూప్‌-ఎలో ఉండగా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఆతిథ్య దేశం మలేషియాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి. కాగా, ఫైనల్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్‌ గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా జట్లు కూడా ఉన్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, సమోవా, ఆఫ్రికాకు చెందిన క్వాలిఫయర్ జట్టు చోటు దక్కించుకున్నాయి. ఇది కాకుండా, గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఆసియా నుంచి క్వాలిఫయర్ జట్టు ఉంది.

టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మలేషియాలోని 4 వేదికలు ఎంపిక చేశారు. గ్రూప్ A అన్ని మ్యాచ్‌లు సెలంగోర్‌లోని బ్యూమాస్ ఓవల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలోనే జరగనుంది. అయితే గ్రూప్ B అంటే పాకిస్థాన్ తన మ్యాచ్‌ని డాక్టర్ హర్జీత్ సింగ్ జోహార్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది.