ఒక్క క్లిక్‌తో బట్టలు ట్రైల్ వేసుకోవచ్చు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్.

ట్టల దుకాణం నడుపుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్. గూగుల్ మీ కోసం వర్చువల్ అపెరల్ ట్రై ఆన్ లైట్ టూల్‌ను ఇండియాలో కొత్తగా తీససుకొచ్చింది.


ఈ ఫీచర్ ద్వారా దుకాణాదారులు ఒక ఫోటో లేకుండానే వర్చువల్‌గా దుస్తులను ప్రయత్నించవచ్చు.

దీని ద్వారా షాపుల యాజమానులు బట్టలు ఆర్డర్ చేసేముందు తమ శరీరంపై బట్టలు ఎలా కనిపిస్తాయో దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు

టాప్స్, బాటమ్స్, డ్రెస్సులు, జాకెట్లు, బూట్లు ఎలా సరిపోతాయో వాస్తవికంగా ప్రదర్శించడానికి అప్‌లోడ్ చేసిన ఒకే ఫోటోను ఇది ఉపయోగిస్తుంది

ఈ టూల్‌ను ఉపయోగించుకోడానికి గూగుల్ మద్దతు ఇస్తున్న దుస్తుల జాబితాలో ‘ట్రై ఇట్ ఆన్’ ఐకాన్ కోసం వెతకాలి. ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు విభిన్న శైలిలో దుస్తులను వీక్షించవచ్చు.

గూగుల్ కస్టమ్ ఏఐ ఫ్యాషన్ మోడల్ ద్వారా ఈ టూల్ పనిచేస్తుంది. ఈ యాప్ వివిధ బట్టల ప్రవర్తనతో పాటు శరీర ఆకారాలను ఆర్ధం చేసుకుంటుంది. వేరే వేరే శరీరాలపై బట్టలు ఎలా ముడుచుకుంటాయి.. ముడతలు ఎలా పడతాయి.. ఎలా సాగుతాయి అనే డేటాను విశ్లేషిస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.