శీతాకాలంలో విరివిగా లభించే సింగాడా దుంపలు చూడడానికి నల్లటి బొగ్గుల్లా కనిపించినా, లోపల మాత్రం తెల్లగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయని, వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని శరీరానికి పోషణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి అసలు ప్రయోజనాలేంటో చూద్దాం..
సింగాడాలు కొద్దిగా తీపి, వగరు కలగలిసిన రుచిలో క్రంచీగా ఉంటాయి. వీటిని చాలా రకాల ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటారు. సాధారణంగా వీటిని ఉడికించుకుని లేదా కాల్చుకుని తినవచ్చు. పలు రకాల వంటకాల్లోనూ యాడ్ చేసుకోవచ్చు. సలాడ్స్, సూప్స్, శాండ్ విచ్ లతో తినవచ్చు. వీటిని ఎండబెట్టి తయారు చేసిన పిండిని పూజలు, ఉపవాసాల సమయంలో రొట్టెలు, లడ్డూలు లేదా కూరల్లో వినియోగిస్తుంటారు.
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
సింగాడా దుంపలు అనేక అనారోగ్యాలను నివారించే సర్వ రోగ నివారిణిగా పనిచేస్తాయి.
1. జీర్ణక్రియ మెరుగుదల, మలబద్ధకం నివారణ
సింగాడాలో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి, చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి.
2. ఎముకలు, గుండె మెదడు ఆరోగ్యం
వీటిలో కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్ కాపర్ వంటి ముఖ్యమైన మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఎముకలు: ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి.
గుండె: శరీరంలో రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించి, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడతాయి.
మెదడు: మెదడుకు చురుకుదనాన్ని అందించి, ఏకాగ్రతను పెంచుతాయి.
3. చర్మ సౌందర్యం & శిరోజాల రక్షణ
సింగాడాలో అరుదుగా లభించే లారిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడడంతో పాటు, శిరోజాలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
చర్మానికి తగినంత తేమను అందించి, చర్మం పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటికి పంపి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. రోగనిరోధక శక్తి & మధుమేహ నియంత్రణ
పోషకాలు: వీటిలో బి, సి, ఇ, కె విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి పోషణను అందిస్తాయి.
మధుమేహం: సింగాడాలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉండటం వలన మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార నియమాలు పాటించే ముందు, దయచేసి తప్పనిసరిగా నిపుణులు లేదా వైద్యుడిని సంప్రదించండి.
































