ఈ 5 రకాల ఆదాయంపై ఒక్క రూపాయి టాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు

టీఆర్ ఫైల్ చేసేందుకు గడువు సమీపిస్తోంది,ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉంది. ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం సంపాదనలో కొంత మేర టాక్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది.


అయితే అసలు టాక్స్ కట్టాల్సిన అవసరం లేని ఆదాయం ఏదైనా ఉందా? అనే విషయం తెలుసుకుందాం!

ఇండియాలో ఈ ఐదు రకాల ఆదాయంపై ఒక్క రూపాయి టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు !

వ్యవసాయంపై వచ్చే అదాయం
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(1) ప్రకారం వ్యవసాయం నుండి వచ్చే ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. పంటలు, తోటపని, మొక్కలు , పంటల నుండి సంపాదించిన ఆదాయంపై ఏ రకమైన టాక్స్ ఉండదు. అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(1A) కింద నిర్వచించబడింది.

స్కాలర్‌షిప్స్, అవార్డులు

భారతదేశంలో విద్యా ప్రయోజనాల కోసం సంస్థలు స్టూడెంట్స్‌కు అందించే స్కాలర్‌షిప్‌లపై ఏ విధమైన టాక్స్ ఉండదు. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుండి విద్యార్థులు ఎడ్యుకేషన్ కోసం పొందే అవార్డులు లేదా స్కాలర్‌షిప్‌లపై సెక్షన్ 10(16) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

సెక్షన్ 10 (17A) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర ప్రభుత్వం అధికారికంగా లేదా భారత ప్రభుత్వం విద్యార్థులకు మంజూరు చేసిన ఏదైనా అవార్డులు , రివార్డులపై పన్ను మినహాయింపు ఉంటుంది. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర్ చక్ర వంటి శౌర్య పురస్కారాల విజేతలు , పెన్షన్ పొందే ఇతరులు పొందుతున్న పెన్షన్‌పై పన్ను మినహాయింపు ఉంటుంది.

ఒక వ్యక్తి నుండి బహుమతిగా తీసుకున్న వాటిపై
క్రింది సందర్భాలలో, ఒక వ్యక్తి తీసుకున్న మానెటరీ గిఫ్ట్స్‌పై టాక్స్ విధించబడదు:
I. ఒక వ్యక్తి విషయంలో
a. వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి;
b. వ్యక్తి యొక్క సోదరుడు లేదా సోదరి;
c. వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి యొక్క సోదరుడు లేదా సోదరి;
d. వ్యక్తి యొక్క తల్లిదండ్రులలో ఎవరికైనా సోదరుడు లేదా సోదరి;
e. వ్యక్తి యొక్క ఏదైనా వంశపారంపర్య లేదా వారసుడు;
f. వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఏదైనా వంశపారంపర్య లేదా వారసుడు;
g. (b) (f) లో సూచించబడిన వ్యక్తుల జీవిత భాగస్వామి నుండి బహుమతిగా తీసుకున్న వస్తువులపై ఇన్‌కమ్ టాక్స్ ఉండదు.

HUF నుండి పొందిన బహుమతులు

హిందూ ఉమ్మడి కుటుంబం (HUF)లో
వ్యక్తి వివాహం సందర్భంగా పొందిన డబ్బు, వీలునామా ద్వారా/ వారసత్వంగా అందుకున్న డబ్బు, చెల్లింపుదారు లేదా దాత మరణం ద్వారా పొందిన డబ్బు, లోకల్ అథారిటీ నుండి అందుకున్న డబ్బు [ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(20)లో వివరంగా నిర్వచించబడింది].

గ్రాట్యుటీ
పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు గ్రాట్యుటీ వంటి కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు లభించే గ్రాట్యుటీపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యుటీ వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు రూ.3 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. పెన్షన్‌లో సమయంలో ఒకేసారి పొందే మొత్తం డబ్బుపై కూడా కొన్ని షరతుల ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.

Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాలకు ఇన్‌కమ్ టాక్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.