‘డ్రాగన్’ గా యంగ్ టైగర్ ఫిక్స్

www.mannamweb.com


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇది ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇప్పటిదాకా కూడా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎన్టీఆర్ దేవర పూర్తయ్యాకా వార్ 2 సినిమాతో ఫుల్ బిజీగానే ఉంటున్నాడు. అయితే అతి త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.ఇప్పటికే ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ టైటిల్ మీద రకరకాల చర్చలు జరిగాయి. ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్‌ను పెడుతున్నట్టుగా లీకులు మీద లీకులు అందాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ టైటిల్ బాగా వైరల్ అయ్యింది. కానీ ఈ టైటిల్ కన్ఫామా అన్న డౌట్స్ చాలా మందిలో కూడా ఉన్నాయి. అయితే తాజాగా భఘీరా మూవీ డైరెక్టర్ అభిమానులకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అని చెప్పేశాడు. మాటల్లో అసలు విషయం చెప్పేశాడు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజిలో వైరల్ అవుతుంది. బాగా ట్రెండ్ అవుతుంది.

నెల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూల్లోంచి ఈ ముక్క ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతుంది. డ్రాగన్ అని ఆ డైరెక్టర్ నోటి నుంచి వచ్చిన మాటని ఇప్పుడు టైగర్ అభిమానులు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. NTR కి ఓ రేంజిలో ఎలివేషన్స్ ఇస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏసుకుంటూ ఎడిట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. NTR మామూలు సినిమాలతోనే దుమ్ము దులిపేస్తాడు.. ఇక నీల్ తో సినిమా అంటే ఆరాచకమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలే నీల్ సినిమాలలో ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. పైగా NTR లాంటి టైగర్ దొరికితే ఊరుకుంటాడా? అందుకే టైగర్ ని డ్రాగన్ గా మారుస్తున్నాడు.

డ్రాగన్ ఎంత భయంకరమైనదో తెలిసిందే. అతి భయంకర రూపంతో నిపులు కక్కే స్వభావం ఉన్న క్రూర జంతువుగా మనం చాలా సినిమాల్లో చూశాం. ఇక ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇండియాలో ఆ రేంజ్ ఊచకోత డ్రాగన్ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ వినగానే నీల్ ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి డ్రాగన్ గా మారబోతున్న మన యంగ్ టైగర్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో.. అయితే నీల్ ఇదే టైటిల్ కంటిన్యూ చేస్తాడా? లేదా ఇంకా బెటర్ గా మారుస్తారా ? అనేది చూడాలి