వైఎస్‌ జగన్ సంచలన నిర్ణయం.. ప్రతి బుధ, గురువారాలు కార్యకర్తలతో భేటీ

www.mannamweb.com


వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో పార్టీ బలపేతంపై ఫోకస్‌ చేసిన ఆయన..

క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలను పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రతి బుధ, గురువారాలు జగన్‌ కార్యకర్తలతోనే గడపనున్నారు. ఆ సమయంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇందుకోసం రోజుకు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ జగన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు.