సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణం.. మహిళలకు బంపర్ ఆఫర్..

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపులోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ పథకం పేరు లక్ పతి దీదీ. దీనిలో మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పిస్తారు. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలో అసలు లక్ పతి దీదీ పథకానికి అర్హత ఏమిటి? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రస్తుత సమాజంలో మహిళ కేవలం వంట గదికే పరిమితం కావడం లేదు. మకుటం లేని మహరాణిలా గృహ సీమను పాలిస్తూనే.. ఉద్యోగ, వ్యాపారాల్లోనూ సత్తా చాటుతోంది. మన దేశంలోని చాలా కంపెనీల్లో ప్రస్తుతం మహిళా సీఈఓలే ఉన్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ పరిస్థితులు దీనికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. అయితే మహిళలు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రం సాధిస్తేనే కుటుంబమైనా.. సమాజమైనా వేగంగా వృద్ధి సాధిస్తుందని అనేక మంది నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా సంక్షేమానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపులోని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఈ పథకం పేరు లక్ పతి దీదీ. దీనిలో మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పిస్తారు. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలో అసలు లక్ పతి దీదీ పథకానికి అర్హత ఏమిటి? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత మొత్తంలో రుణం వస్తుంది? దాని ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..
మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిల్లో ఈ లక్ పతి దీదీ ఒకటి. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా 2023లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దీనిని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2024-25 ఇంటరిమ్ బడ్జెట్లో దాదాపు 3కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చాలని నిర్ధేశించుకున్నారు. ఈ పథకాలనికి అర్హతల గురించి ఇప్పుడు చూద్దాం..

లక్ పతీ దీదీ పథకానికి అర్హతలు..
ఇది మహిళలకు.. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ.. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకం ద్వారా రుణం పొందేందుకు అర్హలు. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
దరఖాస్తునకు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఎస్‌హెచ్‌జీ సభ్యత్వ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అవసరం అవుతాయి. వీటిని సిద్ధం చేసుకున్నాక మీ జిల్లలోని మహిళా శిశు అభివృద్ధి శాఖకార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లక్ పతీ దీదీ పథకం గురించి దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. ఆ ఫారమ్ తీసుకొని అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత పైనే పేర్కొన్న డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలి. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలుంటే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.

అవసరమైన శిక్షణ కూడా..
ఈ పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. అది మంజూరైన తర్వాత వ్యాపారానికి అవసరమైన శిక్షణను కూడా అందిస్తారు. వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్ లైన్ వ్యాపారం, బిజినెస్ సంబంధించిన శిక్షణను అందించి వారి కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తారు.