RRB Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

RRB Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..


ఈ నోటిఫికేషన్‌లో 5,696 ఉద్యోగాలకు ప్రకటన చేసింది. అయితే రైల్వే శాఖ మాత్రం ఈ పోస్టుల సంఖ్య పెంచింది.

పోస్టుల వివరాలు ఇవే..
దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఖాళీలున్నాయి. అత్యధికంగా బిలాస్‌పూర్‌ జోన్‌లో 4,435 పోస్టులు ఉన్నాయి. అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 87 ఖాళీలు ఉన్నాయి.

ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలను ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.