బైక్ నడిపేవారికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ఇకపై అలా చేస్తే కేసు

బైక్ నడిపేవారికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ఇకపై అలా చేస్తే కేసు


ప్రతిరోజు ఉదయం పేపర్ తెరవగానే.. కచ్చితంగా కనిపించే వార్త రోడ్డు ప్రమాదాలు. నిత్యం ఎక్కడో ఓ చోట, ఏదో ఒక మూల ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రాణం పోతూనే ఉంది.

ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నా పట్టించుకునే నాథుడేడీ. నిబంధనలు పాటించటంలో.. ఏం కాదులే అనే అలుసో.. మనల్ని ఎవడేం చేస్తాడనే నిర్లక్ష్యమో తెలియదు కానీ..

తప్పు ఎవరిది అయినా ప్రాణం పోతోంది.. బాధితుల కుటుంబాల్లో గుండె కోత మిగులుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బైక్ నడిపేవారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలో బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే.. కేసులు నమోదు చేయవచ్చంటూ పోలీసులకు సూచించింది.