18న కేబినెట్‌.. 19 నుంచి అసెంబ్లీ..?

తేదీలు ఖరారు చేసిన కొత్త ప్రభుత్వం!


రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు…

గురువారం సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. దరిమిలా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కొత్తప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18న కేబినెట్‌ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. మర్నాటి (19వ తేదీ) నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దాదాపు నిశ్చయించినట్లు తెలుస్తోంది.