హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి ఈ సమీక్షకు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు ఈ నెల 18న తెలంగాణ మంత్రి మండలి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ మేరకు ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు.
పెండింగ్ అంశాల పరిష్కారానికి కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2 తర్వాత ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.