డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు!

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టులకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.


అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా మొత్తంగా 56 జూనియర్ మేనేజర్ పోస్టులను హెచ్‌సీఎల్ భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది.

వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జూనియర్ మేనేజర్ పోస్టులకు జులై 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జులై 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని చెప్పవచ్చు.

ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉండనుందని సమాచారం అందుతోంది. జూన్ నెల 1వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందిన వాళ్లకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎగ్జామ్‌లో జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు 20 శాతం మార్కులు తెచ్చుకోవాలి.