Jagan: దెబ్బ మీద దెబ్బ.. జగన్‌కు GAD లేఖ

Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న GAD (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ) నుంచి ఆయనకు లేఖ వెళ్లింది.


ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ఫర్నీచర్‌, వీడియో కాన్ఫరెన్స్ కోసం ఉపయోగించే పరికరాలు తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకున్నారని.. అధికారం పోయి 15 రోజులు అవుతున్నా ఇంకా రిటర్న్ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అదే లేఖలో సచివాలయం రూల్స్‌ను కూడా స్పష్టంగా రాసారు.

గత ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు. సచివాలయంలోని సామాగ్రి తన ఇంట్లోని గదికి షిఫ్ట్ చేయించుకుని దానినే సచివాలయంగా మార్చేసారు. మొన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్తే ఈ విషయం బయటపడింది. దాంతో వెంటనే సచివాలయానికి చెందిన వస్తువులన్నీ అప్పగించాలని జగన్‌కు లేఖ రాసారు. మరి దీనిపై జగన్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.

అయితే గతంలో దివంగత నేత కోడెల శివప్రసాద్ రావు విషయంలో కూడా ఇలాగే జరిగిందని.. ఆయనపై కేసు పెట్టడంతో ఆయన ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆ పాపమే జగన్‌కు తగిలిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.