డిప్యూటీ సీఎం పిలుపుతో కదిలిన సీఎస్…. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

డిప్యూటీ సీఎం పిలుపుతో కదిలిన సీఎస్…. కలెక్టర్లకు కీలక ఆదేశాలు


కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. డయేరియాతో పలు చోట్ల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి వ్యక్తి మృతి చెందారు.

దీంతో డయేరియా కట్టడిపై అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. డయేరియా నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. దీంతో కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రజలకు శుద్ధమైన నీటిని అదించాలని ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు క్లీన్ చేయాలని సూచించారు. ఓహెచ్ఎస్ఆర్ లీకేజులు లేకుండా చేయాలని ఆదేశించారు. 217 నీటి వనరుల్లో కాలుష్యం ఉందని, వచ్చే నెల నుంచి డయేరియా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధికారులను కలుపుకుని పోవాలని పేర్కొన్నారు. డయేరియాతో చనిపోయి ఘటనల దృష్ట్యా మళ్లీ పునరావృతం కాకూడదని కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.