లోక్‌సభ స్పీకర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు.


ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. లోక్‌సభ స్పీకర్ కుర్చీలో ఎవర్ని కూర్చోబెట్టాలా అని బీజేపీ హై కమాండ్ తర్జన భర్జన పడుతోంది.

ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్‌ల వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది