ఒంట్లో కొలెస్ట్రాల్‌ సహజంగా తగ్గాలంటే.. రోజూ 30 నిమిషాలు ఇలా చేయండి!

Cholesterol Exercises: ఒంట్లో కొలెస్ట్రాల్‌ సహజంగా తగ్గాలంటే.. రోజూ 30 నిమిషాలు ఇలా చేయండి!


కొలెస్ట్రాల్ సమస్య గుండెపోటు, స్ట్రోక్‌ సమస్యకు కారణం అవుతుంది. అయితే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే దీనిని సైలెంట్‌ కిల్లర్ అంటారు. ప్రతి 6 నెలలకు బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ.. తరచూ తనిఖీ చేసుకుంటూ ఉంటే తొలి నాళ్లలోనే పసిగట్టవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్‌కు కేవలం మందులు వాడటం వల్ల మాత్రమే కొలెస్ట్రాల్ అదుపులో ఉండదు..

కొలెస్ట్రాల్ పెరిగితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని ముట్టుకోకపోవడమే మంచిది. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతోపాటు తక్కువ నూనె, మసాలాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కేవలం జిమ్‌కి వెళ్లడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గవు. బదులుగా ఈ కింది 5 జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతిరోజూ 30-40 నిమిషాలు తప్పనిసరిగా నడవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజువారీ నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం నడవలేకపోతే, కనీసం రాత్రి వేళల్లో అయినా నడవడం అలవాటు చేసుకోవాలి.

వాకింగ్‌తో పాటు జాగ్ కూడా చేయవచ్చు. రన్నింగ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అయితే, అకస్మాత్తుగా వేగంగా పరుగెత్తడం ప్రారంభించకూడదు. క్రమంగా వేగాన్ని పెంచాలి. సైక్లింగ్ చేయడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితాయి. రోజులో ఎప్పుడైనా ఇంటి చుట్టూ సైకిల్ తొక్కండి. ఇది కండరాల నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

స్విమ్మింగ్‌ కూడా చేయవచ్చు. స్విమ్మింగ్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలపరుస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆస్తమా సమస్యలను తగ్గిస్తుంది. జిమ్‌కి వెళ్లే బదులు ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయవచ్చు. యోగా వల్ల కొలెస్ట్రాల్‌తో పాటు షుగర్, రక్తపోటు, బరువు కూడా అదుపులో ఉంటాయి.