2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుంది..

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.


ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు.

ఏపీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. చంద్రబాబు, జగన్‌, పవన్‌.. మోదీ పక్షమే అని, ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమే అని అన్నారు. కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలొస్తున్నాయి, కడపలో ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్‌ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదు,
ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్‌ వారసులని అన్నారు రేవంత్ రెడ్డి.