ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ఇది డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది. అధిక ఒత్తడికి గురైతే అనేక వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒత్తిడి, ఆందోళన గుండెపై చాలా ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి హార్ట్ రేటు, రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది, ఇది గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాలక్రమేణా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అరిథ్మియా వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదం పెంచుతుంది. స్ట్రెస్ గుండెపోటు, స్ట్రోక్ రిస్క్‌ను పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఒత్తిడి లేదా ఆందోళనకు బాడీ ఎలా స్పందిస్తుందో నిర్ణయించడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. స్ట్రెస్ ఎదుర్కొన్నప్పుడు, మెదడులోని హైపోథాలమస్ కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదలను పెంచుతుంది. ఈ హార్మోన్లు శరీరాన్ని ముప్పును ఎదుర్కోవడానికి లేదా దాని నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉంచుతాయి. స్ట్రెస్ లెవల్స్ ఎగ్జిమా, సోరియాసిస్, మొటిమలు వంటి సమస్యలను మరింత పెంచుతాయి. ఒత్తిడి వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత ఆయిల్ ప్రొడక్షన్‌ను పెంచుతుంది. దీంతో మొటిమలు ఏర్పడతాయి. అంతేకాకుండా, ఒత్తిడి స్కిన్ బ్యారియర్ ఫంక్షన్‌పై నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపుతుంది. దీని కారణంగా ముడతలు, సన్నని గీతలు ఏర్పడతాయి.
ఒత్తిడి, ఆందోళన శ్వాస వ్యవస్థపై కూడా ప్రభావితం చూపిస్తాయి, స్ట్రెస్ ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస వేగం పెరగడం, పానిక్ అటాక్స్ కూడా రావచ్చు. ఆందోళన కారణంగా హైపర్‌వెంటిలేషన్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ తగ్గింపు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే, వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురైన వ్యక్తులు తరచుగా జలుబులు వస్తాయి, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తాయి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు, గట్ గట్-బ్రెయిన్ యాక్సెస్ ద్వారా నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ, ఒకదానితో ఒకటి దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి. ఒత్తిడి ఈ కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తుంది, అప్పుడు ఇర్రిటబుల్ బావెల్ సిండ్రోమ్ (IBS), యాసిడ్ రిఫ్లక్స్, క్రానిక్ ఇన్‌డైజెషన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఒత్తిడి వల్ల పేగులోని బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా క్రోన్స్ వ్యాధి, పెప్టిక్ అల్సర్ వంటి పరిస్థితులను మరింత తీవ్రతరమవుతుంది. ఒత్తిడిలో ఉన్న చాలా మందికి వికారం, అతిసారం లేదా మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.