టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..ఆ ఇద్దరు కీలక నేతలకు ఛాన్స్!

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..ఆ ఇద్దరు కీలక నేతలకు ఛాన్స్!


ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై అనర్హత వేటు పడింది.

ఈ నేపథ్యంలో ఉపఎన్నికను జూలై 12వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన మహమ్మద్ ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.